Sunday, November 10, 2024
Homeజిల్లా వార్తలుపసుపు సాగు కోసం స్టడీ టూర్

పసుపు సాగు కోసం స్టడీ టూర్

కేసముద్రం మార్కెట్ పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు

ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు

స్పాట్ వాయిస్, కేసముద్రం:  కేసముద్రం మండల పరిధిలో పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో పాటు, ధర కూడా తగ్గుతుండడంతో ఈ ప్రాంతంలో పసుపు విస్తీర్ణాన్ని పెంచడం, ధర ఆశించిన రీతిలో పొందడానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ ఏర్పాటు చేశారు.
దేశంలో పసుపు సాగుకు పేరు ఎన్నిక గల మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతాన్ని సందర్శించడానికి స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్లు మార్కెట్ చైర్మన్ మర్రి.నారాయణరావు తెలిపారు. సాంగ్లీ ప్రాంతంలో పసుపు సాగులో అక్కడి రైతులు వినూత్నమైన పద్ధతులు ఆచరించడంతో పాటు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి సాధించడానికి విభిన్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారని, ధర కూడా ఆశించిన రీతిలో అక్కడి రైతులు పొందుతున్నారని చైర్మన్ తెలిపారు. ఈమేరకు సాంగ్లీ ప్రాంతాన్ని సందర్శించడానికి స్టడీటూర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసముద్రం ప్రాంతంలో పసుపు పంట పూర్వవైభవాన్ని సాధించడానికి స్టడీ టూరు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బంటు.రమేష్, డైరెక్టర్లు, రైతు నాయకులు, వ్యాపార ప్రతినిధులు,కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments