బుల్లెట్ కాకా.. ఏసీబీకి చిక్కెన్..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ‘‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..’’ పాటతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన కాకకు పైసల అవసరం బాగా వచ్చినట్టున్నది. ఖర్చులు పెరిగి జీతం డబ్బులు చాలుతున్నట్టు లేదు. పైసలు సమకూర్చుకునుడు ఎట్లనో ఏమో అని ఎటు చూసినా ఏం కనిపించినట్టులే. ఏం చేయ్యాల్నో తెల్వక పాపం లంచం కావాల్నని అడిగిండు. ఇంటి పర్మిషన్ ఇవ్వాల్నంటే డబ్బులిస్తేనే చేస్తానని ఖరాఖండిగా చెప్పిండు. చిర్రెత్తుకొచ్చిన ఇంటి యజమాని ఏసీబీని ఆశ్రయించిండు. దీంతో బుల్లెట్ బండి అశోక్ రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంతకీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గుడుగ్గని.. అనే పాటతో మెరిసిన యువతి భర్తే మన అశోక్ కాక. డ్యూటీ ఎక్కడ చేస్తడనుకుంటున్నరా.. బడంగ్ పేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా డ్యూటీ చేస్తున్నడు.
RELATED ARTICLES
Recent Comments