స్పాట్ వాయిస్, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన పానుగంటి.విష్ణువర్ధన్ కు జాతీయ మానవ హక్కుల న్యాయం సేవా సంఘం అధ్యక్షుడు మంగళపెళ్లి.హుస్సేన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన సమావేశంలో జిల్లా ఉత్తమ పౌరసేవ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విష్ణువర్ధన్ పలు సమస్యలపై స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల సాధన కోసం చట్టానికి లోబడి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని కొనియాడారు.అనంతరం విష్ణువర్ధన్ మాట్లాడుతూ తనకు గౌరవం దక్కడం ఎంతో సంతోషమని అన్నారు. అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Recent Comments