Sunday, September 22, 2024
Homeసినిమామలయాళి నటుడితో జతకట్టిన సామ్

మలయాళి నటుడితో జతకట్టిన సామ్

స్పాట్ వాయిస్, డెస్క్: సమంత ప్రధాన పాత్రలో న‌టిస్తున్న ‘శాకుంత‌లం’ పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతోంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేస‌కుని పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌ను స్టార్ట్ చేసింది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన స‌మంత ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. మైథ‌లాజిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ యువ న‌టుడు దేవ్ మోహన్ కీల‌క‌పాత్రలో న‌టించాడు. తాజాగా ఈయన ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఆదివారం దేవ్ మోహ‌న్ బ‌ర్త్‌డే సందర్భంగా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహ‌న్ దుష్యంతుడి పాత్రలో క‌నిపించ‌నున్నాడు. గుర్రంపై యుద్ధ వీరుడిగా ఇంట‌న్సీవ్ లుక్స్‌తో పోస్టర్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లు అర్హ కీల‌క‌పాత్రలో నటించింది. దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో గుణ టీంవ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ నిర్మిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments