Sunday, September 22, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం మీ రాశిఫలం

ఈ వారం మీ రాశిఫలం

వారఫలాలు (18-09-2022 to 24-09-2022)
మేషం:
వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.
వృషభం:
నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.
మిథునం:
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
కర్కాటకం:
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలులో ముందడుగు వేస్తారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి.
సింహం:
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య:
గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి.
తుల:
ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.
వృశ్చికం:
ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి.
ధనుస్సు:
సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం:
వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి.
కుంభం:
స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
మీనం:
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments