ఫ్లాష్..ఫ్లాస్
నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం..
సీఎస్ కు ఆదేశాలు జారీ చేసి సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమన్నారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు.
Recent Comments