Monday, September 23, 2024
Homeకెరీర్జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ ఫలితాల్లో 'షైన్' ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం

స్పాట్ వాయిస్, హన్మకొండ: జేఈఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ పలితాల్లో ‘షైన్’ ప్రభంజనం సృష్టించింది. జాతీయ స్థాయిలో 1 వ ర్యాంకు సాధించి కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి. రాజేంద్రకుమార్, మూగల రమ తెలిపారు. జేఈఈ అడ్వాన్స్ – 2022 ఎంట్రన్స్ పలితాలు ఆదివారం విడుదల కాగా షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు ఈ సందర్బంగా పేర్కొన్నారు.

షైన్ విద్యాసంస్థలు మొదటి నుండి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ మరియు నీట్ లలో అత్యుత్తమమైన శిక్షణను వరంగల్ లో అందిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా అద్భుతమైన అణిముత్యాలుగా తయారుచేసి జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో 1వ ర్యాంకు సాధించిన జి. విగ్నేష్ (6131006), 225 ర్యాంకు సాధించిన బూర్జ విష్ణుతేజ (6083257) ను కళాశాల యాజమాన్యం అభినందించింది.

అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్ తో మామూలు విద్యార్థులను కూడా మెళికలు తిరిగిన విద్యార్థులుగా తీర్చి దిద్దడం జరుగుతుందని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకోవడం వలనే ఈ విజయాలు సాధించారని వ పేర్కొన్నారు. ఈ విజయాలకు తోడ్పడిన మా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్, జూనియర్ కాలేజి డైరెక్టర్ రంగనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన రాజు గౌడ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments