మల్హర్ లో ఎడతెరిపి లేని వర్షం
పొంగి పొర్లుతున్న వాగులు,చెరువులు
తాడిచెర్ల ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
స్పాట్ వాయిస్,మల్హర్: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో ని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.మండలంలోని మానేరు నది ఉదృతంగా ప్రవహిస్తుంది.వరద నీటికి మానేరు పరివాహక ప్రాంతంలో ని పంట పొలాలు నీట మునిగాయి.భారీ వర్షానికి తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరడం తో సుమారు 12000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది అని, అదేవిధంగా మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినట్టు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి తెలిపారు.
భారీ వర్షానికి మానేరు నది లోకి భారీ వరద వస్తుండటం తో తీర ప్రాంత గ్రామాలైన తాడిచెర్ల,మల్లారం, పీవి నగర్, వల్లెంకుంట,కుంభంపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ జివాకర్ రెడ్డి,కొయ్యూరు ఎస్సై 2 ప్రశాంత్ తెలిపారు.
Recent Comments