Sunday, November 24, 2024
Homeతెలంగాణఅట్టహాసంగా వన్ షాపింగ్ మాల్ ప్రారంభం

అట్టహాసంగా వన్ షాపింగ్ మాల్ ప్రారంభం

*అట్టహాసంగా వన్ షాపింగ్ మాల్ ప్రారంభం
*ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
*ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసి టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్

స్పాట్ వాయిస్, హన్మకొండ : ప్రత్యేకమైన కుటుంబ షాపింగ్ మాల్, ప్రతిరోజూ సరికొత్త అనుభవాన్ని అందించే సరికొత్త సంచలనాత్మక షాపింగ్ అనుభవం – వన్ షాపింగ్ మాల్ ను ఆదివారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అలాగే టాలీవుడ్ నటి, కాజల్ అగర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. పూర్తి ఫ్యామిలీ స్టయిలింగ్ అవసరాల కోసం 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తెలంగాణలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ను నిర్వాహకులు హన్మకొండలో ఏర్పాటు చేయడం విశేషం. వస్త్ర పరిశ్రమలో అపారమైన అనుభవం ఉన్న వన్ షాపింగ్ మాల్ చైర్మన్ నమ:శివాయ కస్టమర్లు మొత్తం కుటుంబం కోసం విస్త్రృత వస్త్ర శ్రేణి ఎంపిక చేసుకునేలా ఈ షాపింగ్ మాల్ లో నాణ్యమైన వస్త్రాలను అత్యంత సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. మహిళలకు అనేక రకాల చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రెస్ మెటీరియల్స్, పిల్లలు, యువతుల కోసం పార్టీ డ్రెసెస్, ఫెస్టివల్ కోసం సెపరేట్ డ్రెసెస్, డెయిలీ వేర్, ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ దుస్తులు, కేటలాగ్ చీరలు, పట్టు పెళ్లి దుస్తులు, కాంచీపురం పట్టు చీరలు, ఉప్పాడ చీరలు, హై-ఫ్యాన్సీ చీరలు, సల్వార్లు, కుర్తా పైజామాలు అందుబాటులో ఉంచారు. పురుషులు అధునాతన దోతీలు, కుర్తాలు, షర్టులు, టీ షర్టులు, ప్యాంట్లు, జీన్స్, పెండ్లి దుస్తులు తాజా వస్త్ర శ్రేణి అందుబాటులో ఉంచారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ విషాలమైన షాపింగ్ మాల్ లో అన్ని వయస్సుల వారికి పూర్తి స్థాయిలో దుస్తులు అందుబాటులోఉన్నాయని, మంచి సేవతో, నాణ్యమైన దుస్తులు, అందుబాటు ధరల వంటి ఖ్యాతితో కస్టమర్లను ఇక్కడికి వచ్చేలా ప్రోత్సహిస్తుందని అన్నారు..

*వన్ షాపింగ్ మాల్ ఓ మైలురాయి..
హన్మకొండలో వన్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం ఒక మహత్తరమైన సందర్భమని, సువిశాలమైన, అతి పెద్ద మాల్ పట్టణంలో ఒక మైలురాయి అవుతుందని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ అన్నారు. కుటుంబమంతటికీ వారి వారి అభిరుచులకు తగినట్లుగా ఈ షాపింగ్ మాల్ లో అన్నీ ఒకే చోట లభిస్తాయన్నారు. మహిళలు, పురుషులు, పిల్లల కోసం వేర్వేరు విస్తృతమైన వస్త్రాలు, డిజైన్లు ఈ షాపింగ్ మాల్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. వాస్తవానికి ఇది అందరికీ గొప్ప స్టయిల్ ఆప్షన్లను అందించే పూర్తి ఫ్యామిలీ స్టోర్ అని కాజల్ కొనియాడారు.

*చిరస్మరణీయమైన షాపింగ్ అనుభవం
వన్ షాపింగ్ మాల్ పట్టణంలోనే అన్ని వయస్సుల వారి స్టయిలింగ్ అవసరాలను తీరుస్తుందని, కస్టమర్ల సౌలభ్యం మేరకు చిరస్మరణీయమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వన్ షాపింగ్ మాల్ చైర్మన్ నమ:శివాయ తెలిపారు. రెడీమేడ్స్, పట్టు చీరలు, జీరో నుంచి వంద సైజు వరకు ఎత్నిక్ వేర్, హైదరాబాద్ లో లభించే దుస్తులన్నీ ఇప్పుడు వన్ షాపింగ్ మాల్ లో అందుబాటు ఉన్నాయన్నారు. సరసమైన ధరలకే అన్ని రకాల వస్త్ర శ్రేణిని అందిస్తుందని, ఈ ధరలకు, నాణ్యత కస్టమర్లు మరెక్కడా పొందలేరన్నారు. మా వద్ద ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కాసం నమశివాయ కోరారు.

కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీష్, గండ్ర వెంకట రమణారెడ్డి, తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, టీవీసీసీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీనా మసూద్, వరంగల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ చెన్నం మధుసూధన్ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments