భూపాలపల్లి సింగరేణిలో పేలుడు
– ముగ్గురికి తీవ్ర గాయాలు
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి కేటీకే 8 ఇంక్లైన్ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బండి రాజశేఖర్, ఎర్రవెల్లి శ్రీనివాస్, సిహెచ్ రామక్రిష్ణ అనే కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గురువారం గనిలో బొగ్గును వెలుగు తీసేందుకు పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టారు. కేబుల్ వైర్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో బ్లాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యి పేలుడు సంభవించినట్లు సమాచారం. (స్పాట్ వాయిస్) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో సీహెచ్ రామక్రిష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు.
Recent Comments