అడ్డుకోబోయిన కొడుక్కూ దెబ్బలు
స్పాట్ వాయిస్, డెస్క్: అత్త టీవీ సౌండ్తగ్గించమన్నదనే కోపంతో చేతివేళ్లను విరిచేసింది ఓ కోడలు. ఈ మహారాష్ట్రలోని అంబర్నాథ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వృశాలీ కులకర్ణీ అనే మహిళ తన కోడలు విజయ కులకర్ణీ ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నారు. వృశాలీ పూజ చేసుకుంటోంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న కోడలు విజయ టీవీ చూస్తోంది. టీవీ సౌండ్.. పూజకు అంతరాయం కలిగిస్తోందని బంద్ చేయమని కోడలికి చెప్పింది. కానీ, కోడలు ఆమె మాటలు పెడచెవిన పెట్టి వాల్యూమ్ ఇంకా పెంచింది. తన మాట వినలేదని ఆగ్రహించిన అత్త.. ఆ కోడలిని మందలించేందుకు వచ్చింది. వచ్చి టీవీని ఆపేసింది. అయితే, కోపంతో కోడలు రెచ్చిపోయింది. టీవీ ఆపిందని ఆమెపై చేయి చేసుకునేందుకు సిద్ధపడింది. అత్తను దుర్భాషలాడింది. అత్త సైతం తగ్గకపోవడంతో.. వారి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. కొట్లాట సమయంలో అత్త వేలు చూపించి మాట్లాడిందని ఆమె వేలును విరిచేసింది. ఆ గొడవ అంతటితో ఆగిపోలేదు. వారిద్దరూ గొడవ పడుతున్న సమయంలో కొడుకు సౌరభ్ రంగంలోకి దిగాడు. ఇద్దరికీ సర్ది చెబుదామని మధ్యలో దూరితే అతడికి సైతం దెబ్బలు తప్పలేదు. తీవ్ర గాయాలతో అత్త.. శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కోడలిపై ఫిర్యదు చేసింది.
Recent Comments