జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సరికొత్త సీతాకోకచిలుక మంగళవారం కనువిందు చేసింది. గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ అరుదైన సీతాకోకచిలుక భక్తులకు కనిపించింది. ఆ సీతాకోక చిలుక రెక్కలపై సింగిడి పూసినట్లు ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సరికొత్త సీతకొకను చూసినవారంతా.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
Recent Comments