Sunday, November 24, 2024
Homeతెలంగాణవర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

వర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

వర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

60మంది విద్యార్థినులకు అస్వస్థత
12 మందిని ఎంజీఎంకు తరలింపు

ఆందోళనలో తల్లిదండ్రులు

స్పాట్ వాయిస్ , వర్ధన్నపేట: వర్ధన్నపేట ఎస్టీ హాస్టల్ లో సోమవారం రాత్రి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. హాస్టల్లో మొత్తం 190మంది విద్యార్థినులు ఉన్నారు.

సోమవారం రాత్రి 9 గంటలకు సుమారు 100 మంది భోజనం చేయగా.. 60 మంది విద్యార్థినులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. హాస్టల్ స్పందించి వెంటనే వర్ధన్నపేట సీహెచ్ సీకి తరలించారు. విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన ఎమ్మెల్యే అరూరి రమేష్ వర్ధన్నపేటకు చేరుకున్నారు. 12 మంది విద్యార్థినులకు తీవ్ర ఇబ్బంది ఉండగా.. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. మిగిలిన విద్యార్థినులకు వర్ధన్నపేట సీహెచ్ సీ లో చికిత్స చేయిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. హాస్టల్ ను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments