Sunday, November 24, 2024
Homeక్రైమ్మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన అల్లుడు..?

మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన అల్లుడు..?

మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన అల్లుడు..?
సింగరేణి ఉద్యోగం కోసమేనా..!
స్పాట్ వాయిస్, గణపురం: మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన ఘోర ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చోటు చేసుకుంది. గణపురం మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్ల వాగు వద్ద బైక్ పై వస్తున్న మామను అల్లుడు ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మామ బండారి ఓదెలు అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన బండారి ఓదెలు సింగరేణి ఉద్యోగి. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగురు కూతుళ్లు. చిన్న భార్యకు కూతరు, కుమారుడు ఉన్నాడు. ఆయన త్వరలో వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని చిన్న భార్య కొడుక్కు ఉద్యోగం ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పెద్ద భార్య రెండో కూతురు భర్త నక్క రమేశ్ సోమవారం సాయంత్రం గుండ్లవాగు వద్ద బైక్ వస్తున్న మామాను ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేశాడు. అనంతరం ఆయనే నేరుగా గణపురం పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలియగానే ఎస్సై అభినవ్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments