Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్మీరు దీవిస్తే దేశం కోసం కొట్లాడుతా..

మీరు దీవిస్తే దేశం కోసం కొట్లాడుతా..

మీరు దీవిస్తే దేశం కోసం కొట్లాడుతా..
అందరూ రమ్మంటున్నారు.. దేశాన్ని బాగు చేయమంటున్నారు..
నిజామాబాద్ గడ్డ నుంచి సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

స్పాట్ వాయిస్, నిజామాబాద్: ‘‘దేశం కోసం నన్ను పోరాడాలంటున్నరు. అందరూ వెంట ఉంటరట. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తరా.. చెప్పాలె.. సరే, మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రారంభిస్తం.. ముందుకు పోతం, తెలంగాణలాగే దేశాన్ని బాగు చేస్తం.’’ అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, నూత‌న క‌లెక్టరేట్‌ను ప్రారంభించిన అనంత‌రం నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మ‌త‌పిచ్చితో, అప్రజాస్వామిక విధానాల‌తో, అధికార దురంహ‌కారంతో పాలన సాగిస్తున్న బీజేపీని 2024లో ఇంటికి సాగ‌నంపి మన పార్టీని తెచ్చుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ ముక్త్ భార‌త్ జెండా ఎగుర‌వేసి ఈ దేశాన్ని బాగు చేద్దామ‌ని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి మంచి ప‌ని చేయ‌లేదని, ఎవ‌ర్నీ ఉద్దరించ‌లేదని విమర్శించారు. అంత‌ర్జాతీయంగా ప‌రువుపోయే ప‌నులు చేస్తున్నారు. ప్రతిప‌క్షాల‌ను చీల్చుతూ.. ప్రభుత్వాల‌ను కూల‌గొడుతూ, ఒక అహంకారంతో, బ‌లుపుతో, మ‌ద‌మెక్కిన విధానంతో గ‌వ‌ర్నమెంట్లను ప‌డ‌గొడుతామ‌ని మాట్లాడ‌తున్నారని, ఆనాడు నేను ఒక్కడినే. మీరంతా క‌లిసివస్తే స‌ముద్రమై ఉప్పొంగి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. వ‌చ్చిన తెలంగాణ రాష్ట్రంలో రైతుల‌ను, పేద‌ల‌ను కాపాడుకుంటున్నామని చెప్పారు. దేశం బాగుప‌డాలంటే ఆరోగ్యక‌ర‌మైన రాజ‌కీయాలు ఉండాలని, అహంకార రాజ‌కీయాలు సరికాదన్నారు. . ప్రజాస్వామ్యంతో, స‌హ‌న‌శీల విధానంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శ‌క్తుల రాజ్యం రావాలని చెప్పారు. 28 రాష్ట్రాల రైతులు జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని తనను ఆహ్వానించారని, భార‌త‌దేశం గురించి పిడికిలి బిగించాలన్నారు. ఈ నిజామాబాద్ గ‌డ్డ నుంచే ప్రక‌టిస్తున్నానని, మ‌నం భార‌తీయ రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభిద్దామన్నారు. తెలంగాణ‌ను బాగు చేసిన‌ట్లే దేశాన్ని బాగు చేద్దామన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments