స్పాట్ వాయిస్ , హన్మకొండ రూరల్ : పేకాట ఆడుతూ.. బడా వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. దామెర మండలం లోని వరంగల్- భూపాలపట్నం జాతీయ రహదారికి పక్కన ఉన్న ఎన్ ఎస్సార్ పాల డైరీ, స్కూల్స్, హోటల్స్ అధినేత నాయిని సంపత్ రావు ఇంట్లో పేకాట ఆడుతూ పలువురు పట్టుబడ్డారు. ప్రస్తుతం నాయిని సంపత్ రావు పరారీలో ఉన్నాడు. మిగతా వారిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుంచి 8 సెల్ ఫోన్స్, సుమారు రూ.3. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన పేకాట రాయుళ్లు ప్రస్తుతం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
Recent Comments