కరీమాబాద్ రోడ్ల పై వేటకొడవళ్లతో హల్ చల్
స్పాట్ వాయిస్ , వరంగల్: వరంగల్ గ్యాంగ్ వార్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఉర్సు గుట్ట సమీపంలో కత్తులతో దాడి చేసుకోగా.. ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడి భయం నుంచి నగర జనం కోలుకోకముందే.. మళ్లీ వేటకొడవాళ్లు రక్తం చూశాయి.
వివరాల్లోకి వెళ్తే..
కరీమాబాద్ లో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రోడ్ల పై వేటకొడవల్లతో హల్చల్ చేశారు. కరీమాబాద్ ఉర్సు బొడ్రాయి సమీపంలో బత్తిని మహేందర్, బత్తిని అఖిల్ మధ్య గొడవ జరిగింది. బత్తిని అఖిల్ కి చెందిన డ్యుక్ బైక్ ను, బత్తిని మహేందర్ వర్గం ధ్వంసం చేసింది. దీంతో అఖిల్ తన సోదరుడు అయిన బత్తిని నిఖిల్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, కాశికుంట పోచమ్మ దేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం, బత్తిని మహేందర్ కి చెందిన కారును వెంబడించి ధ్వంసం చేశారు. దీంతో కోపంతో రగిలిపోతు ఇరువర్గాలకి చెందిన వారు తల్వార్, వేటకొడవల్లు, కత్తులతో కరీమబాద్ రోడ్లపై హాల్ చల్ చేస్తూ దాడులు చేసుకున్నారు. స్థానికులను, వాహనదారులను, భయబ్రాంతులకు గురి చేశారు. ఇందులో బత్తిని కిరణ్ (బోజి) తలకు తీవ్రగాయాలయ్యాయి. బత్తిని నిఖిల్ బుజం పై కత్తిగాట్లు పడ్డాయి. మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments