సబ్ స్టేషన్ ఆపరేటర్ పై కేసు నమోదు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్ , గణపురం: విధులపట్ల నిర్లక్ష్యం వహించిన గణపురం సబ్ స్టేషన్ ఆపరేటర్ గుర్రం సుమన్ పై ఆదివారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. బాధితుడు కాంట్రాక్టు కార్మికుడు మూల శ్రీనివాస్ భార్య మూల పద్మ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై మ్యాక అభినవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన మూల శ్రీనివాస్ వరంగల్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న సుమన్ గతంలో కూడా మూడుసార్లు ఇదేవిధంగా నిర్లక్ష్యం వహించడంతో మూల శ్రీనివాస్ గాయపడ్డ విషయం తెలిసిందే శనివారం కూడా సుమన్ నిర్లక్ష్యంగా సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అతనిపై చర్యలు తీసుకోవాలని మూల శ్రీనివాస్ భార్య పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు.
Recent Comments