పెండింగ్ చలాన్లు చెల్లించాలి
దామెర ఎస్సై హరిప్రియ
సైలానీ బాబా దర్గా వద్ద వాహన తనిఖీలు
స్పాట్ వాయిస్, దామెర: వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించాలని దామెర ఎస్సై హరి ప్రియ సూచించారు. ఆదివారం సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా.. మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ శివారులోని సైలానీ బాబా దర్గా వద్ద వరంగల్- భూపాలపట్నం జాతీయ రహదారిపై ఎస్సై హరిప్రియ వాహాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన సంభందిత పత్రాలు లేని వారికి ఫైన్ వేసి, పెండింగులో ఉన్న చలాన్లను కట్టించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తు,పెండింగ్ చలాన్లనూ చెల్లించి, హెల్మెట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్,పొల్యూషన్ కార్డ్ వెంట ఉంచుకోవాలన్నారు. వాహనాలపై విధించిన చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మండల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ చలాన్లు చెల్లించాలి
RELATED ARTICLES
Recent Comments