ఆందోళనకు దిగిన వీఆర్ఏలు
ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం
పోలీసుల అడ్డుకోవడంతో గార్డెన్ ఎదుట ధర్నా
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు 42 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎదుట తమ ఆవేదన వెల్లబోసుకున్నారు. వర్ధన్నపేట లోని లక్ష్మి గార్డెన్స్ లో ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు వచ్చిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట బైఠాయించారు. ఇది గమనించిన ఎమ్మెల్యే రమేష్ వారిని లోపలికి అనుమతి ఇచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆందోళనకు దిగిన వీఆర్ఏలు
RELATED ARTICLES
Recent Comments