Monday, November 25, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం మీ రాశిఫలం...

ఈ వారం మీ రాశిఫలం…

వార రాశిఫలాలు

(04-09-2022 to 10-09-2022)
మేషం:
ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
వృషభం:
వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
మిథునం:
ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు లాభిస్తాయి.
కర్కాటకం:
గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం:
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కన్య:
సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.


తుల:
దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో లోటుపాట్లు సరిద్దిదుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు.
వృశ్చికం:
కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి.
ధనుస్సు:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
మకరం:
ఆర్థిక వ్యవహారాలలో మెరుగైన వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు.
కుంభం:
మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.
మీనం:
వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments