అర్హులందరికీ కొత్త పెన్షన్ కార్డులు ఇవ్వాలి
-జెడ్పీటీసీ గండ్ర పద్మ సత్యనారాయణరావు
స్పాట్ వాయిస్, గణపురం: అర్హులందరికీ కొత్త పింఛన్ కార్డులు ఇవ్వాలని జెడ్పీటీసీ గండ్ర పద్మ సత్యనారాయణరావు అన్నారు. బుద్దారం గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ గండ్ర ఆగంరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కొత్త పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. గ్రామానికి మంజూరైన 91 పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామంలో మిగిలిన అర్హులందరికీ వెంటనే కొత్త పింఛన్ కార్డులు మంజూరు చేయాలని అమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విడుదనేని అశోక్, పంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్, ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు కిరణ్, భద్రయ్య, నాయకులు కొవ్వూరి కిరణ్, మారబోయిన ఐలయ్య, వంగపల్లి భాస్కర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments