మంత్రి కేటీఆర్ కు కరోనా
హోం ఐసొలేషన్ చికిత్స
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, దీంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నానని మంత్రి తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. 2021, ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మళ్లీ తాజాగా ఆయన మరోసారి కరోనా బారిన పడ్డారు.
మంత్రి కేటీఆర్ కు కరోనా
RELATED ARTICLES
Recent Comments