Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుపేదల కోసమే సంక్షేమ పథకాలు

పేదల కోసమే సంక్షేమ పథకాలు

పేదల కోసమే సంక్షేమ పథకాలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్

స్పాట్ వాయిస్‌, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలానికి చెందిన 56మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు , 50మంది ముఖ్య మంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments