Saturday, June 7, 2025
Homeజిల్లా వార్తలుస్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా చక్రధరాచారి

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా చక్రధరాచారి

స్వర్ణకార సంఘం మండల
అధ్యక్షుడిగా చక్రధరాచారి

స్పాట్ వాయిస్,గణపురం: స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా తంగళ్ళపల్లి చక్రధరాచారి నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి కట్కోజుల రాజు ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం మండల కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మండల అధ్యక్షుడిగా తంగళ్ళపల్లి చక్రధరాచారి, ప్రధాన కార్యదర్శిగా శ్రీరామోజు రాంబ్రహ్మచారి, ఉపాధ్యక్షులుగా ముప్పిడోజు రమేశ్, కోశాధికారిగా కొత్తగట్టు ప్రణీత్, సహాయ కార్యదర్శిగా ముప్పిడోజు రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన చక్రధరాచారి మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి స్వర్ణకారుల సంఘం బలోపేతానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments