Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్తూర్పులో కవ్వింపు చర్యలు..

తూర్పులో కవ్వింపు చర్యలు..

తూర్పులో కవ్వింపు చర్యలు..
బీజేపీ నేత గంట రవికుమార్ ఫ్లెక్సీ చించివేత..
చిల్లర రాజకీయాలు మానుకోవాలి..
గంట రవికుమార్ ఫైర్

స్పాట్ వాయిస్ , వరంగల్: వరంగల్ తూర్పులో ఫ్లెక్సీల. లొల్లికి తెరతీశారు. నగరంలో శనివారం బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా నగరంలోని 12 మోరీల దగ్గర బీజేపీ తూర్పు నాయకుడు గంట రవికుమార్ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలే కొంతమంది ఫ్లెక్సీ ని చింపి వేసి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. బండి సంజయ్ చేపట్టిన యాత్ర ఉద్రిక్త తల నడుమ సాగుతుంటే.. కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడడంపై తూర్పు ప్రజలు అసహ్యించుకుంటారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తూర్పులో తన రాజకీయ ఎదుగుదల ను ఓర్వకనే ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ.. ఇలాంటి పనులు సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments