Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ఆంక్షలు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ఆంక్షలు

సభలు, సమావేశాలు బంద్
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30- సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ ప్రకటించారు. పోలీసు ఆంక్షలు శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు అమల్లోఉంటాయని స్పష్టం చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సభను అడ్డుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments