8వ నవాబు కేసీఆర్
తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయ్..
సభ నిర్వహించే తీరుతాం..
స్పాట్ వాయిస్ ,ఓరుగల్లు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేస్తున్న “ప్రజా సంగ్రామ యాత్ర”ను 8వ నిజాం కేసీఆర్ అడ్డుకుంటున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను ప్రారంభించినట్టు చెప్పారు. శుక్రవారం ఉదయం స్టేషన్ ఘన్ పూర్ మండలం పాంనూరు వద్ద బండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు అన్నారు. నిజాం నవాబునే తరిమి కొట్టిన వీరులగడ్డ, మన తెలంగాణ గడ్డ అనేది కెసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తల్లోనూ అలాంటి వీరులే ఆవహించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో… వెనక్కి తగ్గేదే లేదన్నారు.
సభ నిర్వహించి తీరుతాం ..
శనివారం నిర్వహించే బహిరంగ సభను అడ్డుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ సభను జరిపి తీరుతామన్నారు. బహిరంగ సభకు ముందే అనుమతి తీసుకున్నామని , అయినా అనుమతి లేదని అనడం… కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శమన్నారు. కోర్టు అనుమతితో బహిరంగ సభను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. మునావర్ ఫారుఖీ ని తీసుకురావడం… ఆ తర్వాత పాదయాత్రను అడ్డుకోవడం… తనను గృహనిర్బంధం చేయడం… మత ఘర్షణలు సృష్టించడం… ఇప్పుడు బహిరంగ సభను అడ్డుకోవాలని చూడడం… అన్నీ కూడా… లిక్కర్ మాఫియా లో కవిత ప్రమేయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఆరోపించారు. ఏదిఏమైనా బహిరంగ సభను నిర్వహించి తీరుతామన్నారు.
Recent Comments