Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలునీ.. లం... బూతు.. బూతు..

నీ.. లం… బూతు.. బూతు..

నీ.. లం… బూతు.. బూతు..
నా ఊరిలో నీ రాజకీయం ఏందీ..?
గండ్ర భక్తుల లొల్లి..
టీఆర్ఎస్ నాయకులు గెట్టు పంచాయితీ
అ..నుంచి ఱ వరకూ బూతులు..
వింటే చెవులు మూసుకోవాల్సిందే..
భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఆడియో..

 

స్పాట్ వాయిస్, రేగొండ: టీఆర్ఎస్ నాయకుల గెట్టు పంచాయితీ.. అ నుంచి ఱ వరకూ బూతులు వినిపించింది. నా ఊరికెందుకొస్తావంటే.. నా ఊరికెందుకస్తావంటూ.. తెగని లొల్లి. మళ్లీ నా దేవుడు గండ్ర అంటూ.. భక్తి పారవశ్యం. ఇంతకు ఈ బూతులు.. పంచాయితీ, దేవుడు ఏంటనుకుంటున్నారా..?

 

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్.. కొటంచ వార్డు సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు కోడె పాక మొగిలి మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఓ బాధితుడికి ఎమ్మెల్యే వద్ద పరిహారం ఇప్పించే పని క్రెడిట్ కోసం ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. నా ఊరిలో ఎందుకు రాజకీయం చేస్తావ్.. నువ్వు ఊరిలో నువ్వు చేసుకో అంటూ లొల్లి పెట్టుకున్నారు. మొదటి వాగ్వాదం లాగా మొదలై.. ఇక బూతుపురాణం అందుకున్నారు. ఇక అవి ఎవరైనా వింటే.. వీళ్ల నాయకులా.. అనేలా తిట్టుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments