Saturday, September 21, 2024
Homeతెలంగాణప్రశ్నిస్తే.. అరెస్టులా...?

ప్రశ్నిస్తే.. అరెస్టులా…?

పోలీసులు గృహ నిర్బంధం దారుణం..
ప్రశ్నిస్తున్నారనే.. అరెస్టులు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సర్కారు
బండి సంజయ్ ను కలిసిన గంట రవికుమార్

స్పాట్ వాయిస్‌, వరంగల్:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేసి గృహ నిర్భందం చేయడం దారుణమని , కేసీఆర్ సర్కార్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీ వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకుడు గంట రవికుమార్ మండిపడ్డారు. బండి సంజయ్ ని పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఆయన స్వగృహానికి తరలించగా.. గంట రవికుమార్ కార్యకర్తలతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకే ఆయనను అరెస్ట్ చేశారన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన బండి సంజయ్ ని పోలీసులు అడ్డుకోవడాన్ని ప్రశ్నిస్తే బలవంతంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ దందాలో ఉంటే ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. కవిత తప్పు చేయడమే కాక దాని కప్పిపుచ్చుకోవడానికి యత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. తప్పకుండా ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికే నా ప్రభుత్వం ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవాలని గంట రవికుమార్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments