Saturday, September 21, 2024
Homeతెలంగాణబండి సంజయ్ అరెస్ట్..

బండి సంజయ్ అరెస్ట్..

బండి సంజయ్ అరెస్ట్..
జనగామ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..
భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు.

.
స్పాట్ వాయిస్‌, జనగామ: జనగామలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేతలపై దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పామ్నూర్‌లో సంజయ్‌ తలపెట్టిన దీక్షను భగ్నం చేశారు. పోలీసుల రాకతో పాదయాత్ర శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అనంతరం బండిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి.ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సంజయ్‌ పాదయాత్ర నేపథ్యంలో ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. బండి సంజయ్ ను చిలుపూర్రు గుట్ట మీదుగా తీసుకెళ్లారు. వరంగల్ జిల్లా సరిహద్దు దాటిన దాటించే ప్రయత్నం చేశారు. . ఏక్షణం ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments