గణపురంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
బలరామకృష్ణుల వేషధారణలో అలరించిన యువకులు, చిన్నారులు
పురవీధుల్లో భారీ ఊరేగింపు
అలరించిన చిన్నారుల వేషధారణ
స్పాట్ వాయిస్, గణపురం : శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా ఆదివారం గణపురం మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో మొదటి ఉట్టిని కొట్టిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు గోవర్ధన దుర్వాస ఆచార్యులు, శ్రీనివాసాచార్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టాభి రాముని ఊరేగింపు కొనసాగింది. బలరామకృష్ణుల వేషధారణలో ఉన్న యువకులు చిన్నారులతో ఊరేగింపు కొనసాగింది. వివిధ వాడల్లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఉట్లను కొడుతూ ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాళ్లపెల్లి గోవర్ధన్ గౌడ్, సాయి, హర్ష ఆధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో తాళ్లపెళ్లి రాకేష్, దిండు సాయికుమార్, పొడిషెట్టి ప్రణయ్, ఒల్లాల అర్జున్ రాములు కృష్ణుడి వేషధారణ వేయగా, వాంకుడోతు గణేష్, గడ్డమీద భాను, మార్క అరుణ్, కందికొండ అభి, మార్క వరుణ్ బలరాముడి వేషధారణలో ఆకట్టుకున్నారు.
Recent Comments