Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత

మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత

మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత
రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి
స్పాట్ వాయిస్, రేగొండ : మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి అన్నారు. 75 వ స్వతంత్ర వారోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని ప్రతి గ్రామంలో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని జెడ్పీఎస్ ఎస్ ఆవరణలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి మొక్కలు నాటారు. అలాగే జెడ్పీ సీఈవో శోభారాణి రేగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి చుట్టుపక్కల మొక్కలు నాటించారు. ఎంపీపీ పున్నం లక్ష్మి రవి మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, ఏపీవో జమీర్, ఎంపీఓ సురేష్, ఉప సర్పంచ్ గండి తిరుపతి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments