Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ మహేందర్
స్పాట్ వాయిస్, రేగొండ : ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ హింగే మహేందర్ అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హింగే మహేందర్ మాట్లాడుతూ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని ఊరూరా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రతీ పల్లె పచ్చగా సస్య శ్యామలంగా ఉండాలంటే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రహీమ్, కొడవటంచ గ్రామ సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, కొడవటంచ ఆలయ చైర్మన్ మాదాడి అనిత కర్నాకర్ రెడ్డి, పెద్దంపల్లి గ్రామ సర్పంచ్ పసుల రత్నాకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పట్టెం శంకర్, రైతు బంధు సమితి నాయకులు సంధ్య-రవీందర్, సోమిడి మోహన్ రావు, సదానందం, రావుల రమేష్, రావుల తిరుపతి, ఆలయ డైరెక్టర్ పోగు సుమన్, తీగల రమేష్, తీగల లింగమూర్తి, రైతులు గైని కుమారస్వామి, యూత్ నాయకులు భిక్షపతి, ఎడ్ల అనూష్, ఎడ్ల గణేష్, పోగు విక్రమ్ రెడ్డి, అంజి, అజయ్, గాజర్ల వెంకటేష్, ఏఈవో వెంగల రణధీర్, పీహెచ్ సీ సిబ్బంది బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments