హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి
మొక్కలు నాటిన కర్కపల్లి సర్పంచ్ పోట్ల నగేష్
స్పాట్ వాయిస్, గణపురం: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు పోట్ల నగేష్ పిలుపునిచ్చారు. 75 వ వజ్రోత్సవ సప్తహం వేడుకల్లో భాగంగా మండలంలోని కర్కపల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. ఇంటింటికీ అందించిన మొక్కలను సర్పంచ్ ప్రజలతో నాటించారు. అలాగే 353 జాతీయ రహదారిపై సర్పంచ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తుచేశారు. అడవుల శాతం పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కర్కపల్లి గ్రామాన్ని నందనవనంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ గౌడ్, గ్రామ కార్యదర్శి స్రవంతి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోట్ల కిష్టయ్య, మూదం సమ్మయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిక్షణకు కృషి చేద్దాం..
RELATED ARTICLES
Recent Comments