Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలు‘ఎస్సార్ స్కాలర్స్’ లో ఘనంగా కృష్ణాష్టమి

‘ఎస్సార్ స్కాలర్స్’ లో ఘనంగా కృష్ణాష్టమి

ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి
గోపిక, గోపాలుడి వేషధారణలో విద్యార్థుల సందడి
స్పాట్ వాయిస్, హన్మకొండ : హన్మకొండ రామ్ నగర్ లోని ఎస్సార్ స్కాలర్స్ హై స్కూల్ లో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్లే గ్రౌండ్ లో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణాష్టమి పండుగ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ చార్జి కవితారెడ్డి, ప్రిన్సిపాల్ సంకీర్తనా రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments