Tuesday, September 24, 2024
Homeజిల్లా వార్తలుఉత్తమ సర్పంచ్ గా గోగుల సత్యనారాయణ రెడ్డి

ఉత్తమ సర్పంచ్ గా గోగుల సత్యనారాయణ రెడ్డి

ఉత్తమ సర్పంచ్ గా గోగుల సత్యనారాయణ రెడ్డి

స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని ఊరుగొండ సర్పంచ్ గోగుల సత్యనారాయణ రెడ్డి ఉత్తమ సర్పంచ్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ అవార్డును ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు,సీపీ తరుణ్ జోషి, డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్ చేతులమీదుగా సత్యనారాయణ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ సర్పంచ్ గా ఎంపిక అవడం తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు,అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు,వైస్ ఎంపీపీ జాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments