Tuesday, September 24, 2024
Homeక్రైమ్ఫ్లాష్..ఫ్లాష్..

ఫ్లాష్..ఫ్లాష్..

ఖమ్మం శివార్లలో ఫ్యాక్షన్ హత్య
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు హత్య..
కృష్ణయ్య.. తమ్మినేని వీరభద్రం తమ్ముడు..
స్పాట్ వాయిస్ , ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ( సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ్ముడు )దారుణ హత్యకు గరయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి దోభీ ఘాట్ వద్ద వెంటాడి చంపారు. కృష్ణయ్య ది రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత. రాజకీయ కక్షలే హత్యకు దారి తీసినట్లు ప్రాథమిక సమాచారం. మృతుడు టేకుపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవ సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments