Tuesday, September 24, 2024
Homeజిల్లా వార్తలుసలేంద్ర సుధాకర్ కు ఇండియన్ పోలీసు మెడల్..

సలేంద్ర సుధాకర్ కు ఇండియన్ పోలీసు మెడల్..

స్పాట్ వాయిస్‌, హన్మకొండ రూరల్: 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాల్లో ” నాలుగో బెటాలియన్ కు చెందిన సలేంద్ర సుధాకర్ ARSI(390)కు “ఇండియన్ పోలీస్ మెడల్” దక్కినట్లు 4వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాదరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుధాకర్ 1983 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరాడు. 2005 లోARSI గా నేరుగా స్పెషల్ టెక్నీషియన్ కోటాలో పదోన్నతి పొందారు. ప్రస్తుతం నాలుగో పటాలంలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెటాలియన్ కు చెందిన ఉద్యోగికి ఇండియన్ పోలీస్ మెడల్ రావడం పట్ల కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విధులలో మంచి ప్రతిభ చూపిన వారికి పోలీస్ శాఖ, ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందని అన్నారు. సిబ్బంది అంతా విధులను నిబద్ధతతో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్ రెడ్డి, రాంబాబు, ఆర్ ఎస్ ఐ అనిల్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments