జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ
స్పాట్ వాయిస్ కేసముద్రం: స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేసమద్రం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆదివారం కేసముద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ .అంబేద్కర్ సెంటర్ మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ఫూలే విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసముద్రం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు వల్లందాస్.సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర రాష్ట్రాల పిలుపు మేరకు కేసముద్రం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నారన్నారు. జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి, జాతి కోసం అమరులైన స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకోవడం గొప్ప అదృష్టం అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యం తో ఉంటే ఎంతటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చన్నారు.
దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో పాస్టర్ లు కాలెపాక మహేందర్, ఎలుక ప్రభుజీవన్, సాల్మన్, డోలి మధు, పిల్లి కుమారస్వామి, బనిశెట్టి వెంకటేష్, డోలి రాములు, బిర్రు జీవన్, పట్నాయక్, రాజేష్,చందన్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments