Wednesday, September 25, 2024
Homeజిల్లా వార్తలుబైక్ ర్యాలీలో ఎమ్మెల్యే అరూరి..

బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే అరూరి..

బైక్ ర్యాలీలోఎమ్మెల్యే అరూరి

స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో యువజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో దేవులపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంగపహాడ్ గ్రామంలోని మాజీ సైనికులకు, ఉత్తమ రైతులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే అరూరి హాజరై వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ప్రవీణ్, కార్పొరేటర్ రవి నాయక్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments