Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుఎంతోమంది ప్రాణత్యాగం.. స్వాతంత్ర్య ఫలం..

ఎంతోమంది ప్రాణత్యాగం.. స్వాతంత్ర్య ఫలం..

మహనీయుల విగ్రహాలను శుభ్రపరచిన బీజేపీ నాయకులు

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: మహనీయుల పోరాట ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని నాటి పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు ఆదివారం “అజాది కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను బీజేపీ నేతలతో కలిసి రేవూరి ప్రకాశ్ రెడ్డి శుభ్రపరిచి పూలమాలు వేసి నివాళులర్పించారు.

జాతీయ జెండాలను పట్టుకొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపేలా జాతీయ నేతలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తయినా నేపథ్యంలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజల ఆనందంగా పాల్గొంటున్నారని అన్నారు. మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం వెనుక ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యువ నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహ రాములు, పట్టణ అధ్యక్షులు బాల్నె జగన్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రాజు, జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి ఉమా, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, కల్వచర్ల రామాంజనేయులు, మల్యాల వంశీ, మల్యాల సాంబమూర్తి, కందికొండ శ్రీనివాస్ , బీజేపీ పట్టణ నేతలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments