Wednesday, September 25, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం మీ రాశిఫలం..

ఈ వారం మీ రాశిఫలం..

వార రాశిఫలాలు
14-08-2022 టు 20-08-2022
మేషం:
వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
వృషభం
నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులను సైతం మీకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్నతరహా పరిశ్రమల వారు నష్టాల నుంచి బయటపడతారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మాటలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.
మిథునం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నత అధికారుల సహాయం అందుతుంది. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

కర్కాటకం
వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం
సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. అన్నిరంగాల వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్య
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.

తుల
స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.

వృశ్చికం
ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల సహాయం అందుతుంది. అన్ని రంగాల వారికి వారం మధ్యలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు:
ఉద్యోగమున ఇతరుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి కొంత ఊరట లభిస్తుంది. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

మకరం:-
ఉద్యోగస్థులకు అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి నూతన లాభాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప ఆరోగ్య సమస్యలు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

కుంభం:-
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆధరణ పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాల అనుకూల సమయం. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం:-
గృహ నిర్మాణప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశములు పొందుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. వ్యాపారాలలో అంచనాలు ఫలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి.
కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments