Wednesday, September 25, 2024
Homeజిల్లా వార్తలుగ్లోబల్ రెయిన్​ బో స్కూల్ ఆధ్వర్యంలో 247 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

గ్లోబల్ రెయిన్​ బో స్కూల్ ఆధ్వర్యంలో 247 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

గ్లోబల్ రెయిన్​ బో స్కూల్ ఆధ్వర్యంలో
247 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ప్రారంభించిన డీసీపీ సుభాష్​ చంద్రబోస్​
= కూసుమంచి పుర వీధుల్లో ప్రదర్శన
= నినాదాలతో మార్మోగిన కూసుమంచి
= జాతీయ స్ఫూర్తిని చాటిన విద్యార్థులు
= పాల్గొన్న​ఏసీపీ బస్వారెడ్డి, తహసీల్దార్​ మీనన్​,ఎంపీడీవో కరణాకర్​ రెడ్డి, ఎంఈవో రామాచారి
సర్పంచ్​ చెన్నామోహన్​,ఎంపీటీసీ మదాసు ఉపేందర్, సీఐ సతీశ్​, ఎస్సై నందీప్

స్పాట్ వాయిస్‌, ఖమ్మం:   భావి తరాలకు జాతీయ స్ఫూర్తిని చాటలని డీసీపీ(లా అండ్​ అర్డర్​) సుభాష్ చంద్రబోస్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో గల గ్లోబల్​ – రెయిన్​ బో స్కూల్ కరస్పాడెంట్​ ఎండీ ఇర్షాద్ ఆధ్వర్యంలో నిర్వహించి వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య​అతిథిగా పాల్గొని 247 అడుగుల జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు జెండాను చేతబూని కూసుమంచి పుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. తిరంగా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. జెండా ప్రదర్శనలతో విద్యార్థులు దేశభక్తిని చాటారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను శ్లాఘించారు. జైహింద్..​ నినాదాలతో కూసుమంచి మార్మోగింది. పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కూసుమంచి సెంటర్​ నుంచి నేలకొండపల్లి రోడ్డు, సూర్యాపేట‌‌ –ఖమ్మం ప్రధాన రహదారి వెంట కొనసాగింది. కూసుమంచి సెంటర్​ లో డీసీపీ సుభాష్​ చంద్రబోస్​, ఏసీపీ బస్వారెడ్డి, ఎంపీడీవో కరుణాకర్​ రెడ్డి, తహసీల్దార్​ మీనన్​ మాట్లాడారు. ముందుగా గ్లోబల్ రెయిన్​ స్కూల్​ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులతో పెద్ద ఎత్తున జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి భారీ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ప్రజలు, విద్యార్థులలో జాతీయ స్ఫూర్తి నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి స్వాంతంత్ర్యాన్ని అందించిన మహానీయులు అడుగుజాడల్లో నడవాలన్నారు. బ్రిటీష్ వారితో భగత్​ సింగ్​ ,అల్లూరి లాంటి వారు ఎందరో మహోన్నతులు స్వాంతంత్ర్యం కోసం పోరాడరన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ ఎటువంటి దర్వాసనాలకు లోను కాకుండా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్​, ఎంపీటీసీ మదాసు ఉపేందర్​ , ఎంఈవో బీవీ రామాచారి, పీహెచ్​సీ డాక్టర్​ శ్రీనివాస్​, ​సీఐ సతీశ్​, ఎస్సై నందీప్​ ఎస్వీఎస్​ కళాశాల కరస్పాండెంట్​ ఆసీఫ్​ పాషా, జేవీఆర్​ఇన్​ చార్జి వీరబాబు, అంగన్​ వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు , విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments