స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తేనే.. అభివృద్ధి జరుగుతుందంటే తానూ రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి వరాలు కురిపిస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామం అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో అద్దంకి దయాకర్ చిన్నపిల్లవాడని సెటైర్ వేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని తెలిపారు. మునుగోడు ఎన్నికలను సెమీఫైనల్‌గా అభివర్ణించారు.
Recent Comments