Saturday, November 23, 2024
Homeతెలంగాణవాయుగుండంగా అల్పపీడనం!

వాయుగుండంగా అల్పపీడనం!

మరో 48 గంటల పాటు భారీ వర్షాలు
పది జిల్లాలకు రెడ్ అలర్ట్
అందులో భూపాలపల్లి, ములుగు జిల్లాలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీగా, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, కుమురంభీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కి.మీ. ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments