Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుమానుకోటలో జోరు వాన

మానుకోటలో జోరు వాన

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
ములుగులో ఇల్లు కూలి వృద్ధురాలి మృతి
కొత్తగూడ మండలంలో గోడ కూలి ఒకరికి గాయాలు
స్పాట్ వాయిస్, మానుకోట: మహబూబాబాద్ లో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ శివారులో కత్తెర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగును తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో భారతి, ఎంపీఓ సత్యనారాయణ పరిశీలించి వాగు ఎవరు దాటకుండా బారికెడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పనులకు వెళ్లే వారిని ట్రాక్టర్ సహాయంతో వాగు దాటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇంటి గోడ కూలి ధరావత్ మౌనిక అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇల్లు కూలి వృద్ధురాలి మృతి
ములుగు జిల్లాలో విషాదం
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర ఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోయం మంగమ్మ(60)కు చెందిన ఇల్లు ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం గమనించిన స్థానికులు మంగమ్మ మృత దేహాన్ని బయటకు తీశారు. ఆమె కుమారుడు భద్రాద్రి కొత్తగూడెం లో ఉంటున్నాడు. రెవెన్యూ అధికారులు కూలిన ఇంటిని పరిశీలించి పంచనామా ప్రక్రియ నిర్వహించి, కలెక్టర్ కు నివేదించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments