Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుచేనేత బీమాపై హర్షం

చేనేత బీమాపై హర్షం

చేనేత బీమాపై హర్షం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
స్పాట్ వాయిస్, వరంగల్ : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేనేత బీమా కల్పించనుండడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం చేనేత జేఏసీ నాయకుడు కటకం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ 23వ డివిజన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్, టీఆర్ ఎస్ పార్టీ డివిజన్ ఇన్ చార్జి యెలుగం లీలావతి-సత్యనారాయణ హాజరై కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని నేటి నుంచి అమలు చేయడం హర్షనీయమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర, చేనేత త్రిఫ్ట్‌, కరెంట్‌ సబ్సిడీ, రుణ మాఫీ, బతుకమ్మ చీరెల తయారీ ద్వారా ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు డీఎస్ మూర్తి, ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, మాజీ కార్పొరేటర్ బాసాని శ్రీనివాస్, గోరంట్ల రాజు, సామల శ్రీధర్, మాచబత్తుల కూమరస్వామి, యెలుగంవెంకటమల్లు, టీఆర్ ఎస్ యువజన నాయకులు భాషకర్ల హరిక్రిష్ణ పటేల్, తుమ్మ కన్నయ్య, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments