Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-తెరాసలోకి కొనసాగుతున్న చేరికలు
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యవజన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే చల్లా సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా వారికి ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నారని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో చేరిన వారందరికీ పార్టీ అండగా నిలబడుతుందని అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో చేరిన వారిలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొయ్యల అనిల్, స్కూల్ చైర్మన్ కొయ్యడ శంకర్, యూత్ అధ్యక్షుడు రేనుకుంట్ల శ్రీకాంత్, గ్రామ పార్టీ కార్యదర్శి కొయ్యడ రాము, జేరుపోతుల ఐలయ్య, తిక్క రమేష్, మేకల రాజయ్య, రాస రాజేష్, బండారి సుమన్, సప్పిడి సాంబయ్య, కోట యాదగిరి, తిక్క రాజు, ఇనుముల శ్రీకాంత్, రేనుకుంట్ల రాజు, జన్ను రమేష్, సీపతి రాజు, జన్ను రాజుకుమార్, కొయ్యడ అనిల్, గడిపి రాజు, కొయ్యడ రాజయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments