రైతుబంధు తరహాలోనే చేనేత బంధుకు శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: నేతన్నలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల పోపా ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మశాలి భవనంలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ పద్మశాలిలంటే నాకు అమితమైన అభిమానమని, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వం పద్మశాలీలకు అండగా నిలిచి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. వలసలు వెళ్లిన చేనేత కార్మికులను తిరిగి స్వగ్రామాలకు తీసుకువచ్చి కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో ఓనర్ అండ్ వర్కర్స్ పథకం కింద 500 మందికి భూమి కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కో యూనిట్ రూ.2 కోట్లతో ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందులో రూ.80 లక్షల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, మిగతా డబ్బులు బ్యాంకు నుంచి రుణంగా పొందవచ్చన్నారు. వలసవెళ్లిన కార్మికులతో పాటు పరకాల నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా కాకతీయ వస్త్ర పరిశ్రమలో ఏర్పాటు అవుతున్న కంపెనీల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత తప్పక ఉంటుందన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రైతుబంధు తరహాలోనే చేనేత బంధు ప్రవేశపెట్టబోతున్నారని ఎమ్మెల్యే చల్లా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పోపా భాద్యులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నేతన్నలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం అండ..
RELATED ARTICLES
Recent Comments